AP Cabinet: సెకీ ఒప్పంద అంశంపై ఏపీ కేబినెట్ లో చర్చ 19 d ago
ఏపీ కేబినెట్లో అదానీ పవర్‌పై కీలక చర్చ జరుగుతుంది. సెకీ ఒప్పందంపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై కేబినెట్ చర్చిస్తుంది. అదానీ పవర్‌పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్‌ని పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉంది. అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా రూ. 1,750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించడమే ఉత్తమమని అభిప్రాయంలో ఉన్నారు. ఒప్పందం రద్దు చేసుకుంటే రూ. 2,100 కోట్లు పెనాల్టీగా చెలించాలిసి ఉంటుంది.